Nara Lokesh : మృతుల కుటుంబాలను పరామర్శించిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.

Nara Lokesh

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న ఉదయం హత్యకు గురైన గడివేముల మండలం, పెసరవాయికి చెందిన టీడీపీ నాయకులు నాగేశ్వరరెడ్డి, ప్రతాప రెడ్డిల అంత్యక్రియల్లో లోకేష్ పాల్గోన్నారు.

అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని  హామీ ఇచ్చారు.

ఇటీవల మరణించిన తమ చిన్నాన్న కుమారుడు మోహన్ రెడ్డి కర్మ కాండలకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం స్మశానానికి కాలినడకన వెళుతుండగా.. పక్కా ప్రణాళికతో ప్రత్యర్ధులు మాటువేసి వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు వివరించారు. ప్రత్యర్ధులు కారుతో ఢీ కొట్టటంతో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.