Nara Lokesh Warns CM Jagan (Photo : Google)
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ కలకలం రేపుతోంది. బీటెక్ రవి అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు. ”పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వచ్చినా జగన్ రెడ్డి గజగజ వణుకుతున్నారు.
పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత.. ఇన్ని చేసినా ఓట్లేసిన జనాలను చూడాలంటే జగన్ రెడ్డికి భయం. సొంత నియోజకవర్గ ప్రజలను ఎదుర్కోలేని పిరికి పంద జగన్. తన ఎన్నికల ప్రత్యర్థి, టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవిని చూసినా జగన్ భయపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపునకు పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు జగన్. రవి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనకి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత” అని నారా లోకేశ్ హెచ్చరించారు.
Also Read : ఆ రూ.27కోట్లు ఎక్కడివి? టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు.. ఏం జరగనుంది
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీకెట్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల నుంచి కడపకు వస్తుండగా యోగివేమన యూనివర్సిటీ సమీపంలో కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అదృశ్యంపై అటు కుటుంబసభ్యులు, ఇటు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారా? లేక పోలీసులు అరెస్ట్ చేశారా? అర్థం కాని పరిస్థితి ఉందని వాపోయారు.
బీటెక్ రవిని ఎందుకు అరెస్ట్ చేశారంటే..
గతంలో నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్న సమయంలో తనను ఎయిర్ పోర్టుకు అనుమతించ లేదంటూ అటు అధికారులపైనా, ఇటు పోలీసులపైనా బీటెక్ రవి చాలా దురుసుగా ప్రవర్తించారని అప్పట్లో వల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంటూ వచ్చింది. ఈ కేసుని ఇంతకాలం ఎందుకు పెండింగ్ లో ఉంచారు, వెంటనే క్లియర్ చేయండి అని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఇవాళ బీటెక్ రవిని వల్లూరు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్.. ఆందోళనలో కుటుంబసభ్యులు, పార్టీ నేతలు
పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వచ్చినా జగన్ రెడ్డి గజగజా వణుకుతున్నాడు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనంని చూడాలంటే జగన్ రెడ్డికి భయం. సొంత నియోజకవర్గ ప్రజల్ని… pic.twitter.com/sPRPcYAALB
— Lokesh Nara (@naralokesh) November 14, 2023