Adimulapu Suresh
Tenth Exams: పదో తరగతి పరీక్షల రద్దు విషయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కీలక కామెంట్లు చేశారు. పరీక్షల రద్దు విషయంలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగా ఇక్కడ కూడా చేయాలని లేదు కదా. అలా పోల్చుకోవాల్సి వస్తే ఏపీలో అమలవుతోన్నసంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా.. అని ప్రశ్నించారు.
గతంలో విద్యార్థుల పరీక్షలు రద్దు ఛేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రాబోయే ఏడాది అకాడమిక్ క్యాలెండర్ కరోనా తగ్గుముఖం ఫట్టిన తర్వాతే ప్రకటిస్తాం. నిట్ ఎగ్జామ్స్.. ఇంటర్ పరిక్షలు ముగిసిన అనంతరం దానికి అనుగుణంగా సమయం ఉండేలా చూసే ప్లాన్ చేస్తాం. తల్లిదండ్రులు ఎవ్వరూ ఆందోళనకు గురి కావొద్దు.
విద్యార్థులు కొద్ది రోజుల వరకూ ఎగ్జాం ప్రిపరేషన్ మూడ్‌లోనే ఉండాలని కోరుతున్నాను. లోకేష్‌ను అమెరికా స్టాండ్ ఫర్డ్ యూనివర్సిటీకి పంపడానికి సత్యం రామలింగరాజు దొరికినట్లుగా అందరికీ దొరకకపోవచ్చు గదా.. అని అన్నారు.