Chandrababu Arrest: ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదు..

అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

AP TDP Leaders

AP TDP Leaders : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Read Also : AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్ .. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు‌పై కక్ష – యువత భవితకు శిక్ష అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు‌పై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు‌పై అక్రమ కేసు ఎత్తివేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి నినాదాలతో కాలినడకన అసెంబ్లీ‌ సమావేశాలకు వెళ్లారు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.

Read Also : AP Assembly : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అంబటి

ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు అక్రమం అన్నారు. ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండగా చట్టసభలకు వెళ్తున్నామని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే మరే అంశమైనా తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు.