Devineni Uma
Devineni Uma Arrest : గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో శుక్రవారం ఉదయం అయనను కలిసేందుకు దేవినేని వెళ్లారు. కానీ… పోలీసులు అనుమతించలేదు. వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు దేవినేని. ఎంత వారించినా వినకపోవడంతో.. ఉమను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. ఉదయం కూడా అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన అడ్వకేట్లను కూడా పోలీసులు అనుతించలేదు. గుంటూరు జీజీహెచ్‌లో అశోక్‌బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.
Read More : Jangaon : అందరి చూపు జనగామ వైపు.. కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ
అశోక్ బాబు అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారన్న కక్షతోనే అరెస్టు చేశారని మండిపడ్డారు. పీఆర్‌సీలోని లోపాలను ఎత్తి చూపడంతోనే అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు దేవినేని ఉమ.
అశోక్ బాబు అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తనపై నమోదైన కేసుపై గతంలో అశోక్ బాబు వివరణ ఇచ్చారు. తాను డీకామ్ బదులుగా బీకామ్ అని తప్పుగా పడిందని చెప్పారు. 2019లోనే ఈ కేసు ముగిసిందన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసును తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు అశోక్ బాబు.
Read More : TDP MLC Ashokbabu : డీకామ్ బదులు బీకామ్ పడింది – అశోక్ బాబు.. అరెస్టును ఖండించిన బాబు
అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు. దీంతో 2022, ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి విజయవాడలోని అశోక్ బాబు ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు అంటించారు. అనంతరం అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు. ప్రభుత్వ సర్వీస్ లో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.