Kanakamedala: ఏపీలో ఫ్యాక్షనిజానికి అధికారం తోడైంది.. ప్రభుత్వానికి కంగారెందుకు?

ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు ఢిల్లీ వచ్చి రహస్య మంత్రాంగం నడుపుతున్నారని అన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్.

Kanakamedala

Kanakamedala Ravindra Kumar: ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు ఢిల్లీ వచ్చి రహస్య మంత్రాంగం నడుపుతున్నారని అన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఢిల్లీలో ఏం జరుగుతతుందో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు కనకమేడల రవీంద్ర కుమార్. ఏపీ ఆర్ధికమంత్రి అప్పుల కోసం ఢిల్లీ వెళ్తున్నారని, అయితే, రహస్యాలు ఉన్న చోట కుట్రలు మోసాలు ఉంటాయని అన్నారు కనకమేడల. రాష్ట్ర పరిణామాలను బట్టి మంత్రుల పర్యటనల పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు.

రాష్ట్ర రాజధాని కోసం 700 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారని, రాజధాని కోసం పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు కనకమేడల రవీంద్ర కుమార్. అమరావతి రాజధాని కోసం చేస్తున్న పాదయాత్రకు సపోర్ట్ పెరిగిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడుతుందన్నారు. రైతుల పాదయాత్రనే తట్టుకోలేని ప్రభుత్వం పాలన ఎం చేస్తుందని ఆరోపించారు.

విద్యా వ్యవస్థకు ఎసరు పెట్టేలా ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని, ఎయిడెడ్ కళాశాల ఆస్తులను ప్రభుత్వం దోచుకుంటుందని అన్నారు కనకమేడల రవీంద్ర కుమార్. విద్యార్థులు అడ్డుపడితే పోలీసులు దాడులు చేస్తున్నారని, ఏపీలో ఫ్యాక్షనిజానికి అధికారం తోడైందన్నారు. పాలనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమైందని అన్నారు. రూ. 25వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉందని అన్నారు.

Annadanam Trust: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

అస్తవ్యస్తంగా విద్యుత్ కొనుగోళ్లు జరుగుతున్నాయని, ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో వైద్యరంగం నిర్వీర్యమవుతుంది.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అడుకుంటున్నారని తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నారని అన్నారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఏపీని ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేసిందని అన్నారు కనకమేడల రవీంద్ర కుమార్.

Amith Shah Meeting: అమిత్ షా మీటింగ్.. సీఎం కేసీఆర్ హాజరుపై అనుమానాలు