Pulivendula : వైఎస్ జగన్‌కు మరో బిగ్‌షాక్.. పులివెందుల జడ్పీటీసీ టీడీపీ కైవసం.. భారీ మెజార్టీ..!

TDP Wins Pulivendula ZPTC : పులివెందుల జడ్పీటీసీ స్థానంకు సంబంధించిన ఫలితం వచ్చేసింది. ఈ జడ్పీటీసీ స్థానంపై టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి బి. భారతి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

TDP Pulivendula ZPTC Candidate Bharati Wins

TDP Wins Pulivendula ZPTC : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేసింది. టీడీపీ 43ఏళ్ల రాజకీయ చరిత్రలో పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అయితే, పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ టీడీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాకిచ్చింది.

Also Read : AP Elections: ఓట్ల లెక్కింపులో ఊహించని ట్విస్ట్.. బ్యాలెట్ బాక్స్‌లో కరపత్రాలు.. చంద్రబాబు, పవన్, లోకేశ్ పేర్లను ప్రస్తావిస్తూ..

ఏపీలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పులివెందుల జడ్పీటీసీ స్థానంకు సంబంధించిన ఫలితం వచ్చేసింది. ఈ జడ్పీటీసీ స్థానంపై టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి బి. భారతి 1463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 7 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, అందులో ఇప్పటికే మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 4 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పులివెందుల స్థానంలో టీడీపీ విజయంతో వైసీపీకి ఊహించిన దెబ్బ తగిలింది.

ఏపీలోని జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఫలితాల్లో కూటమి అభ్యర్థుల జోరు కనిపిస్తోంది. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 170కిపైగా స్థానాల్లో.. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో రెండు వేలకుపైగా చోట్ల కూటమి హవా కొనసాగుతోంది. గుంటూరు జిల్లా జడవల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 74 ఓట్ల తేడాతో గెలుపొందారు. మన్యం జిల్లా సాలూరు మండలం గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవి విజయం సాధించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్‌పేట ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. కడప జిల్లా పెద్దముడియం మండలం సుద్దపల్లె ఎంపీటీసీ స్థానంలో టీడీపీ గెలుపొందింది.