అసెంబ్లీ ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యేతో మజాక్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. నవ్వుల్ నవ్వుల్..
చంద్రశేఖర్ స్పందిస్తూ.. "అన్నీ తెలిసే నాతో ఆడుకుంటున్నారుగా.. మీకో నమస్కారం" అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
- T Venkateshwarlu
- Published On : February 18, 2026 / 03:59 PM IST
MLA Chandrasekhar
- టీడీపీ ఎమ్మెల్యేలకు తారసపడ్డ చంద్రశేఖర్
- బిల్‌గేట్స్‌ను విమర్శిస్తున్నారేంటన్న టీడీపీ నేతలు
- “మీకో నమస్కారం” అంటూ వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
MLA Chandrasekhar: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తారసపడ్డారు. తెలుగుదేశం నేతలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ఎంఎస్ రాజు, అశోక్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డిని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా పలకరించారు.
Also Read: చైనా తయారు చేసిన రోబో డాగ్‌ను తీసుకొచ్చి.. “మేమే తయారుచేశాం” అని చెప్పుకున్న మన వర్సిటీ.. చివరకు
బిల్‌గేట్స్ స్థాయి తెలియకుండా ఆయనను కూడా విమర్శించే స్థాయికి మీ పార్టీ దిగజారిపోయిందేంటి? అని చంద్రశేఖర్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు అడిగారు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ లెక్కలు అడగకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టి బిల్‌గేట్స్ టీ, కాఫీ ఖర్చులంటూ నవ్వులపాలయ్యారుగా.. అని ఎంఎస్ రాజు అన్నారు.
దీంతో చంద్రశేఖర్ స్పందిస్తూ.. “అన్నీ తెలిసే నాతో ఆడుకుంటున్నారుగా.. మీకో నమస్కారం” అంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
