Maidukuru City Panchayat Election
Maidukuru city panchayat election : వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. మైదుకూరులో 24 వార్డులుండగా…. వైసీపీకి 11 మంది, టీడీపీకి 12 మంది, జనసేన తరుపున ఒక కౌన్సిలర్ గెలిచారు.
కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తమ ఎక్స్‌అఫిషియో ఓట్లను మైదుకూరు మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నారు.
దీంతో వైసీపీ బలం 13కు చేరింది. దీంతో జనసేన అభ్యర్థి మద్దతు కీలకంగా మారింది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్‌ను వైసీపీ వైపు తిప్పుకున్నట్లు సమాచారం.