శ్రీకాకుళం జిల్లా పాతపట్నం బీభత్సంగా మారింది. పోలింగ్ బూత్ నెంబరు 21, 22, 23లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ వాళ్లు దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్.. వైసీపీ వాళ్లే దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ వాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. మాట మాట పెరిగి చేతల వరకు వెళ్లింది. పోలింగ్ బూతుల్లోనే కొట్టుకున్నారు.
పాతపట్నం పోలింగ్ బూత్ ల్లోనే టీడీపీ-వైసీపీ ఘర్షణకు దిగటంతో కొద్దిసేపు ఓటింగ్ ఆగిపోయింది. పోలింగ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అదనపు బలగాలు వచ్చాయి. ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టారు. మావో ప్రాబల్యం, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం కావటంతో కేంద్ర బలగాలను పాతపట్నం తరలించారు. ప్రస్తుతం ఆ బూత్ దగ్గర పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు.