home guard attacked two people
home guard attacked two people : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.
Vigilance Officers Searches : ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ దాడులు
బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంటర్ విద్యార్థి నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. అటు నిన్ననే నాగరాజు తల్లి మృతి చెందింది. అయితే ప్రేమికులకు తన తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదని నాగరాజు సోదరి చెబుతోంది.