Vigilance Officers Searches : ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూరు, నందలూరు ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Vigilance Officers Searches
Vigilance Officers Searches : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూరు, నందలూరు ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఉద్యోగుల హాజరు, ఆస్పత్రిలోని ఔషధ గణాంకాలు, సిబ్బంది కొరత, పని తీరును అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ సి.ఐ దస్తగిరి వెల్లడించారు.
Omicron Centres : ఒమిక్రాన్‌పై ప్రభుత్వం అలర్ట్.. డెడికేటెడ్ సెంటర్లుగా 4 ఆస్పత్రులు
అటు విశాఖ జిల్లా ఆరిలోవ విమ్స్‌లోనూ విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై అధికారులు ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత పరిశీలించారు. కాకినాడ జిల్లా తునిలోనూ విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి.