Omicron Centres : ఒమిక్రాన్‌పై ప్రభుత్వం అలర్ట్.. డెడికేటెడ్ సెంటర్లుగా 4 ఆస్పత్రులు
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి.

Delhi Govt Converts 4 Private Hospital Into Dedicated Omicron Centres
Omicron Centres : దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ దేశంలో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య వంద దాటేసింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది.
ఒమిక్రాన్ బాధితుల కోసం ప్రత్యేకించి వార్డులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ పాజిటివ్ బాధితుల కోసం నాలుగు ప్రైవేటు ఆస్పత్రులను డెడికేటెడ్ సెంటర్లుగా మార్చేసింది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా ఒమిక్రాన్ బాధితుల కోసం ప్రైవేటు ఆస్పత్రులను డెడికేటెడ్ సెంటర్ల కోసం కేటాయించింది.
అందులో సాకేత్‌లోని మాక్స్ హాస్పిటల్, సర్ గంగా రామ్ హాస్పిటల్, వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్, తుగ్లకాబాద్‌లోని బాత్రా హాస్పిటల్‌ను డెడికేటెడ్ ఒమిక్రాన్ సెంటర్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఇప్పటికే ఒమిక్రాన్ బారినపడిన వారికి ప్రస్తుతం లోక్ నాయక్ జై ప్రకాష్ (LNJP) ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నాలుగు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also : AP Covid Update : ఏపీలో కొత్తగా 137 కోవిడ్ కేసులు