AP Covid Update : ఏపీలో కొత్తగా 137 కోవిడ్ కేసులు

ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..రాష్ట్రంలో నిన్న కొత్తగా 137 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 

AP Covid Update : ఏపీలో కొత్తగా 137 కోవిడ్ కేసులు

Ap Covid Up Date

Updated On : December 18, 2021 / 7:02 PM IST

AP Covid Update :  ఆంధ్ర ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు కనపడుతోంది. తాజాగా  ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..రాష్ట్రంలో నిన్న కొత్తగా 137 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 14 కేసులు   నమోదయ్యాయి.   కోవిడ్‌‌తో  విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. నిన్న  189 మంది కోవిడ్ బాధితులు పూర్తి   స్ధాయిలో  కోలుకున్నారు.
Also Read : Tirumala Udayastamana seva : తిరుమల ఆలయంలో ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లు
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,60,653  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,75,683 కు చేరింది. ఇక కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 20,59,500 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14,478 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Ap Covid Report

Ap Covid Report