Kanakamedala
Kanakamedala Ravindra Kumar: కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి సంజయ్ వర్మను కలిశారు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వేగంగా తరలించెందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసి కొన్ని సూచనలు చేశారు.
యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూనే.. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సెల్స్, హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా సేకరించిన తెలుగు సహా ఇతర విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందజేసినట్లు తెలియజేశారు కనకమేడల రవింద్రకుమార్.
యుక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతాల నుంచి విద్యార్థుల తరలింపు కోసం తీసుకుంటున్న చర్యలను విదేశాంగ కార్యదర్శి వివరించారు. యుక్రెయిన్ సరిహద్దు సహా నాలుగు దేశాల్లో టీడీపీ ఎన్ఆర్ఐ సెల్స్ పని చేస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడవద్దని, కేంద్రం విద్యార్థుల తరలింపుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ధైర్యం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల వివరాలు తెలుసుకోవడం కోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో వైఫల్యమైంది. ఢిల్లీలో నామమాత్రంగా ఏర్పాట్లు చేసి విద్యార్థులను తరలిస్తున్నామని అంటున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కంటే రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.