Dead
young man died while dancing : అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం నెలకొంది. వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. గౌతమపురి కాలనీలోని వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఓ యువకుడు మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే మృత్యవాతపడ్డాడు. దీంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పుల్లాయప్ప అనే 25 సం.లు వయసు కలిగిన యువకుడు రాత్రి 12 గంటల సమయంలో వినాయక మండలం వద్ద డ్యాన్స్ చేస్తూ ఉన్నపలంగా కిందపడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఆరోగ్యంగా ఉన్న పుల్లాయప్ప ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు.
Vaccine Vinayaka : వ్యాక్సిన్ వినాయకుడు..టీకా వేయించుకుంటేనే రమ్మంటున్నాడు..
నిన్న రాత్రి 8 గంటల నుంచి పుల్లాయప్ప నగరంలోని పలు వినాయక మండపాల దగ్గర చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే అలసిపోయి సొమ్మసిల్లి ఒక్కసారిగా కిందపడిపోవడంతోనే ఊపరాడక చనిపోయాడని స్థానికులు, స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.