Kandula Durgesh : ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు.. ఎవరు పంపించారంటే?
Kandula Durgesh : ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. మావోయిస్టు పేరిట ఈ లేఖలు వచ్చాయి.
- Harish Thanniru
- Updated on- February 11, 2026 / 01:42 PM IST
Kandula Durgesh
Kandula Durgesh : ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. మావోయిస్టు పేరిట ఈ లేఖలు వచ్చాయి. రాష్ట్రంలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు అనగాని సత్యకుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ లకు మావోయిస్టు పేరుతో పోస్టు ద్వారా ఈ లేఖలు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ లేఖలపై అసెంబ్లీ లాబీలో మంత్రి కందుల దుర్గేష్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
Also Read : ఏపీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్ హైలైట్స్.. వైసీపీ టార్గెట్ గా..
నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. నాతోపాటు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ కు లేఖలు వచ్చాయి. మావోయిస్టు పేరుతో వచ్చిన లేఖ చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నేను పనిచేసేది టూరిజం లాంటి చిన్నశాఖ. వ్యక్తిగతంగా శాఖాపరంగా ఎక్కడ ఎలాంటి తప్పులు లేవు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారు. మావోయిస్టులు లేఖలు ఇలా ఉండవు కదా. అయినా నా శాఖలో మావోయిస్టులు లేఖ రాయాల్సిన అంత పెద్ద హడావిడి ఏముంటుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారని కందుల దుర్గేష్ అన్నారు. దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి దుర్గేష్ కార్యాలయ అధికారులు తెలిపారు. లేఖలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం విచారణ జరుగుతుందని తెలిపారు. దీనివెనుక ఉన్నదెవరైనా చట్టం కఠినంగా శిక్షిస్తుందని పేర్కొన్నారు.
