Tirumala Idol Theft: తిరుమలలో అంజన్న విగ్రహం చోరీ.. కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడు బి.టెక్ గ్రాడ్యుయేట్.. ఎం చెప్పాడో తెలుసా?
తిరుమల కొండపై ఏడవ మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి చిన్న(Tirumala Idol Theft) విగ్రహం చోరీకి గురైన తీవ్ర కలకలం రేపిన కేసును పోలీసులు వేగంగా ఛేదించారు.
- V Santhosh Kumar
- Published on- July 23, 2026 / 06:27 PM IST
Tirumala 7th mile anjaneya idol theft case solved b tech student arrested
- తిరుమల ఆంజనేయ విగ్రహం చోరీ
- నిందితుడు బిటెక్ చదివిన యువకుడు
- విశాఖ వద్ద పట్టుకున్న పోలీసులు
Tirumala Idol Theft: తిరుమల కొండపై ఏడవ మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి చిన్న విగ్రహం చోరీకి గురైన తీవ్ర కలకలం రేపిన కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి ఏఎస్పీ రవి మనోహరాచారి శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని విశాఖపట్నానికి చెందిన యశ్వంత్ కుమార్‌గా పోలీసులు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మానసిక వేదనతోనే చోరీ: వెల్లడించిన ఏఎస్పీ:
నిందితుడు యశ్వంత్ కుమార్ బి.టెక్ చదివాడని, చదువు పూర్తయినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని ఏఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకున్న అతడు, విజయనగరం జిల్లా గొర్లమండలంలోని ఒక మఠంలో కొన్ని రోజులు గడిపాడు. తిరుమలకు వచ్చిన సమయంలో ఏడవ మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి చిన్న విగ్రహం ఎంతో ముచ్చటగా కనిపించడంతో, దాన్ని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ చోరీకి(Tirumala Idol Theft) ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.
జీపు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో చిక్కిన నిందితుడు!
ఈ నెల 21వ తేదీ ఉదయం నిందితుడు జీపులో తిరుమల GNC నుంచి తిరుపతికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఏడవ మైలు వద్ద జీపును ఆపమని డ్రైవర్‌కు చెప్పి, అక్కడున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. కేసు దర్యాప్తు కోసం 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, జీపు డ్రైవర్‌ను విచారించగా నిందితుడి వివరాలు లభించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విశాఖపట్నం పారిపోతుండగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
