×
Ad

Ys Jagan: Ys Jagan: సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా మళ్లీ కమిటీలు, కమిషన్లు ఏంటి? సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి గొప్పదా?- జగన్

మూడేళ్ళలో వచ్చేది మా ప్రభుత్వమే. అన్యాయం చేసినోళ్లను బోన్ లో నిలబెడతాం. సుప్రీం సూపర్ విజన్ లో పని చేసిన సీబీఐ రిపోర్ట్ పై మళ్లీ కమిటీలు, కమీషన్లు ఏంటి..?

  • Published On : February 6, 2026 / 07:00 PM IST
  • లడ్డూలలో జంతువుల కొవ్వు లేదని కేంద్ర ల్యాబ్ లు రిపోర్ట్ ఇచ్చాయి
  • ఇప్పటికైనా చంద్రబాబు, పవన్, లోకేశ్ లెంపలేసుకుని దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • మూడేళ్ళలో వచ్చేది మా ప్రభుత్వమే.. అన్యాయం చేసినోళ్లను బోన్ లో నిలబెడతాం

Ys Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి జగన్. జంతువుల కొవ్వు తిరుమల లడ్డూలలో వాడారని అన్యాయమైన దుష్ప్రచారం చేశారని విరుచుకుపడ్డారు. వేంకటేశ్వర స్వామిని అగౌరవపరిచి ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు, దేవుడిని తన రాజకీయాలకు వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చెబుతున్న అపార్థాలను సీబీఐ తేటతెల్లం చేస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసిందన్నారు.

రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన చూసి నాగరిక సమాజం తలదించుకుందన్నారు. పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి మహిళలను బూతులు తిట్టారని వాపోయారు. వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి వెళ్లారు జగన్. జోగి రమేశ్, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

”లడ్డూలలో జంతువుల కొవ్వు లేదని కేంద్ర ల్యాబ్ లు రిపోర్ట్ ఇచ్చాయి. సీబీఐ ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ లు పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చాయి. సీబీఐ చార్జిషీట్ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ పేర్లు ఎక్కడా పేర్లు లేవు. క్లీన్ చిట్ ఇచ్చింది. టీటీడీ రిజెక్ట్ చేసిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను చంద్రబాబు హయాంలో మళ్లీ లడ్డూ తయారీలో వాడారు. డైరీ పేరు, ఇన్వాయిస్ మార్చి మళ్లీ అవే నాలుగు ట్యాంకర్లను పైకి పంపి లడ్డూ తయారీలో వాడారు. ఈ విషయాలన్నీ చార్జిషీట్ పేజ్ 64, 44 లో సీబీఐ పొందుపర్చింది. జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన ట్యాంకర్లను మళ్లీ వెనక్కి ఎలా వెళ్ళాయి?

జంతువుల కొవ్వు అని దుర్మార్గంగా ప్రచారం చేశారు..

జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేస్తారు..? దొడ్డిదారిన నాలుగు ట్యాంకర్లు కొండపైకి ఎందుకు వెళ్ళాయి..? ఎలా వెళ్ళాయి..? ఒక పక్క వివాదం జరుగుతుంటే అవే ట్యాంకర్లు ఎలా వాడతారు..? చంద్రబాబు, పవన్, లోకేశ్ లు దీనికి సమాధానం చెప్పాలి. స్వార్ధ రాజకీయాల కోసం వాళ్లే లేని వివాదాన్ని సృష్టించారు. జంతువుల కొవ్వు అని దుర్మార్గంగా ప్రచారం చేశారు. ముగ్గురూ ఇప్పటికైనా లెంపలేసుకుని దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

చిప్ రిపేర్ చేసుకోమన్నాడు.. తప్పేముంది..?

జోగి రమేశ్ చేసిన తప్పేంటి..? చిప్ రిపేర్ చేసుకోమన్నాడు.. తప్పేముంది..? చంద్రబాబుకి చిప్ సరిగ్గా లేదు కనుకే ఇలాంటివి చేస్తున్నారు. యాసిడ్, పెట్రోల్ బాంబులతో ఇంటిపై దాడులు చేశారు. డీసీపీ రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కలిసి జోగి రమేశ్ ఇంటిపై దాడికి ప్లాన్ చేశారు. అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్తాం. మూడేళ్ళలో వచ్చేది మా ప్రభుత్వమే. అన్యాయం చేసినోళ్లను బోన్ లో నిలబెడతాం. సుప్రీం సూపర్ విజన్ లో పని చేసిన సీబీఐ రిపోర్ట్ పై మళ్లీ కమిటీలు, కమీషన్లు ఏంటి..? చిప్ సరిగ్గా లేకపోవడం అంటే ఇదే. సుప్రీంకోర్టు, సీబీఐ కంటే చంద్రబాబు గొప్పవాడా..? అనుకూలంగా రిపోర్ట్ రాలేదని కమిటీ అంటున్నాడు. అనుకూలంగా ఇంకో రిపోర్ట్ చేయించుకోవడానికా..?” అని జగన్ ప్రశ్నించారు.