Tirumala Ghee Adulteration Case: మళ్లీ న్యూస్‌ హెడ్‌లైన్‌గా కల్తీ నెయ్యి ఎపిసోడ్.. నెల్లూరు ఏసీబీ కోర్టు ఎంట్రీ.. ఏం తేల్చనుంది?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కోసం..కొందరు కావాలనే కక్కుర్తి పడి కల్తీ నెయ్యికు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే అలిగేషన్స్ ఉన్నాయి. అందిన కాడిక దోచుకునేందుకు..నెయ్యి క్వాలిటీ లేకపోయినా..క్వాలిటీ ఉన్నట్లు సర్టిఫికేట్‌ ఇచ్చి కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరిచారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి.

  • Updated on- April 28, 2026 / 08:22 PM IST
  • స్పెషల్‌ సిట్‌ ఛార్జిషీట్లపై ఏసీబీ కోర్టు విచారణ
  • టీటీడీ అధికారులు, డెయిరీల డైరెక్టర్లకు పిలుపు
  • కల్తీ లింకులకు కారకులు ఎవరో తేలుస్తారా?
  • కల్తీ నెయ్యి సరఫరాకు డోర్లు ఓపెన్ చేసిందెవరు?

 

Tirumala Ghee Adulteration Case: అప్పుడే అయిపోలేదు. ఇప్పట్లో అయిపోదన్నట్లుగా ఉంది కల్తీ నెయ్యి ఎపిసోడ్. స్పెషల్‌ సిట్‌ రిపోర్ట్‌ ఎప్పుడో వచ్చింది. అప్పుడే జరగాల్సినంత దానికంటే ఎక్కువే రచ్చ జరిగింది. వైసీపీ వర్సెస్ కూటమి..సోషల్‌ మీడియా ఫైట్..డైలాగ్‌ వార్‌ నెక్స్ట్‌ లెవల్‌ హీట్‌ను క్రియేట్‌ చేసింది. అంతటితో ఇష్యూకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనుకుంటుండగా.. ఏకసభ్య కమిషన్‌ అంటూ ఏపీ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. విచారణను పూర్తి చేసిన కమిషన్‌ ఒకటి రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇంతలోనే నెల్లూరు ఏసీబీ కోర్టు పిక్చర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కల్తీ నెయ్యి ఇష్యూలో ఏసీబీ కోర్టు ఏం తేల్చనుంది?

ఏడాదిగా కల్తీ నెయ్యి ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడప్పుడు చల్లబడ్డట్లు..అంతా అయిపోయినట్లు కనిపిస్తూ..మళ్లీ కొత్త ట్విస్ట్‌తో తెరమీదకు వస్తోంది తిరుమల లడ్డూ ఎపిసోడ్. ఇప్పుడు మరోసారి నెల్లూరు ఏసీబీ కోర్టు విచారణ..ఏకసభ్య కమిషన్ రిపోర్ట్‌ అంటూ చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి..రిపోర్ట్‌ను కూడా ఇచ్చేసింది. ఆ రిపోర్ట్‌పైనే ఐదారు నెలల కింద పొలిటికల్ ఫైట్‌ హీట్‌ వేవ్‌ను తలపించింది. ఏకంగా దాడులకు వరకు వెళ్లింది. సరిగ్గా అదే టైమ్‌లో అసలు వాస్తవాలేంటో తేల్చేందుకు కూటమి సర్కార్ ఏకసభ్య కమిషన్‌ను వేసింది. ఇప్పుడా కమిషన్‌ కూడా రిపోర్ట్ రెడీ చేసి..సర్కార్‌కు అందజేసేందుకు రెడీ అవుతోంది.

కేసు విచారణకు రెడీ అయిన నెల్లూరు ఏసీబీ కోర్టు..

ఇదిలా ఉండగా..లేటెస్ట్‌గా నెల్లూరు ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సిట్‌ వేసిన రెండు చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం..కేసు విచారణకు రెడీ అయింది. స్పెషల్ సిట్‌ ఫస్ట్‌ చార్జిషీట్‌లో 15 మంది, రెండో దాంట్లో 21 మందిని ..మొత్తం 36 మందిని సిట్‌ నిందితులుగా చేర్చింది. ఈ 36 మందిని నెల్లూరు ఏసీబీ కోర్టు విచారణకు పిలువనుంది.

36మంది నిందితుల విచారణ..

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కోసం..కొందరు కావాలనే కక్కుర్తి పడి కల్తీ నెయ్యికు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే అలిగేషన్స్ ఉన్నాయి. అందిన కాడిక దోచుకునేందుకు..నెయ్యి క్వాలిటీ లేకపోయినా..క్వాలిటీ ఉన్నట్లు సర్టిఫికేట్‌ ఇచ్చి కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరిచారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే స్పెషల్ సిట్‌ పలు అంశాలను తాము దాఖలు చేసిన ఛార్జిషీట్లలో మెన్షన్ చేసింది. వాటి ఆధారంగా నెల్లూరు ఏసీబీ కోర్టు 36మంది నిందితులను విచారించేందుకు రెడీ అయింది.

నెయ్యి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు, కొన్ని ప్రైవేటు డెయిరీలు, కొంతమంది టీటీడీ ఉద్యోగులు..కాసులకు ఆశపడి.. కుట్రపూరితంగా కల్తీ నెయ్యి సప్లై చేశారనేది సిట్ మెయిన్ అలిగేషన్. ఈ క్రమలోనే మొత్తం 36 మందిని నిందితులుగా చేరుస్తూ రెండు చార్జిషీట్లు వేసింది. గతేడాది సెప్టెంబర్‌లోనే నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ రెండో ఛార్జిషీట్‌ వేసినా..అత్యంత సున్నితమైన కేసు కావడంతో ఛార్జిషీట్లను ఇన్‌ డిటేయిల్డ్‌గా స్టడీ చేయడం కోసం కోర్టు దాదాపు 9 నెలల సమయం తీసుకుంది. ఎట్టకేలకు సిట్‌ అలిగేషన్స్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు..త్వరలోనే నిందితులను విచారణకు పిలువనుంది.

మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణను పూర్తి చేసింది. ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన కమిషన్, ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఫిబ్రవరి 20న ఏర్పాటైన ఈ ఏకసభ్య కమిషన్ తిరుమలలో పలుసార్లు పర్యటించింది. నెయ్యి కొనుగోలు విధానం, టెండర్ల ప్రక్రియ, నెయ్యి నాణ్యతను పరిశీలించింది. నెయ్యి సరఫరాలో జరిగిన లోపాలు, కల్తీకి కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగా ఎక్స్‌పర్ట్స్ కమిటీ సభ్యుడు విజయ్‌ భాస్కర్ వాంగ్మూలాన్ని కమిషన్ నమోదు చేసింది.

నెయ్యి సేకరణలో నిబంధనలు, ఉల్లంఘనలు అన్నింటిపై డిటేయిల్స్ సేకరించింది. దర్యాప్తులో తేలిన అంశాలను నివేదిక రూపంలో ఈ నెల 30న స్టేట్‌ గవర్నమెంట్‌ అందజేయనుంది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా ప్రభుత్వం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదే టైమ్‌లో నెల్లూరు ఏసీబీ కోర్టు సిట్‌ నిందితులుగా చెప్పబడిన వారిని విచారించనుండటంతో కల్తీ నెయ్యి ఎపిసోడ్‌ మళ్లీ సరికొత్త అప్డేట్స్‌తో వార్తల్లో నిలిచే అవకాశం ఉంది.

Also Read: డీజిల్ తేలేని వ్యక్తి గూగుల్ తెస్తాడా? గవర్నర్ పాలన ఉన్నా బాగుండేదేమో? ఏపీలో పెట్రోల్ కొరతపై సజ్జల సంచలన వ్యాఖ్యలు