tirumala visit started after elcipse
Tirupati: శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 7:00 నుండి 7:45 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. సాయంత్రం 5:11 నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 8:11 గంటలకు ఆలయం తలుపులు మూశారు. దాదాపు 12:00 గంటల అనంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి 8.30 నుండి 12:30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8:11 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును రాత్రి 7:30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. అన్నప్రసాదం కాంప్లెక్స్ మూసివేత వల్ల భక్తులు ఇబ్బంది పడకుండా ఉదయం 6:00 గంటలకు ఫుడ్ కౌంటర్లలో దాదాపు 10 వేల మందికి అల్పాహారం అందించారు. అదేవిధంగా, వైభవోత్సవ మండపం, సిఆర్వో వద్ద దాదాపు 30 వేల పులిహోర పొట్లాలు భక్తులకు పంపిణీ చేశారు.
Bombay HC: ఆధారాల్లేకుండా భర్తను తాగుబోతు, తిరుగుబోతు అనకూడదు.. బాంబే హైకోర్టు తీర్పు