Tirupati: తిరుపతిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా?

తిరుపతి (Tirupati)నగరంలోని ఆర్‌సీ రోడ్డులో కలశం బిల్డింగ్ సమీపంలో ఉన్న ఒక గ్యాస్ గోడౌన్ వద్ద ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం నేలమట్టమైంది.

Four storey building collapses in tirupati-rc road rescue operations underway

  • తిరుపతిలో కూలిన నాలుగు భవనం
  • ఘటనా స్థలంలో రెస్క్యూ చర్యలు
  • నిర్మాణ లోపాలపై అధికారుల ఆరా

Tirupati: xఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఆర్‌సీ రోడ్డులోని కలశం బిల్డింగ్ సమీపంలో ఉన్న ఒక గ్యాస్ గోడౌన్ వద్ద ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం నేలమట్టమైంది. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నూతన భవన నిర్మాణం కోసం పనాది గుంతలు తవ్వుతుండగా, ఊహించని విధంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Deepam 2 Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ‘దీపం 2.0’ అర్హతలు, వివరాలు ఇవే

ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు:

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనం కూలిపోయిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా లేదా శిథిలాల కింద చిక్కుకున్నారా అనే కోణంలో అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం భారీ జేసీబీ యంత్రాల సహాయంతో శిథిలాలను వేగంగా తొలగించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

నిబంధనల ఉల్లంఘనపై అధికారుల ఆరా:

భవనం ఒక్కసారిగా (Tirupati)కూలిపోవడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే భవన నిర్మాణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమా, ఏవైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.