Tirupati : బ్రేకింగ్.. కంటైన్‌మెంట్ జోన్‌గా తిరుపతి, మధ్యాహ్నం 2 నుంచి అవన్నీ బంద్

తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు

Tirupati Declared a Containment Zone : తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు కమిషనర్. మరోవైపు రేపటి(ఏప్రిల్ 27,2021) నుంచి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు ఉంటాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. మధ్యాహ్నం 2 తర్వాత స్వచ్చందంగా దుకాణాలు మూసివేసేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకారం తెలిపిందన్నారు. తిరుపతి మార్కెట్ ని నగరంలో ఏడు ఎనిమిది చోట్ల డీ సెంట్రలైజ్ చేస్తామన్నారు. ఆటోలు, జీపుల్లో పరిమిత సంఖ్యో ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. గంగమ్మ జాతరను ఏకాంతంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గిరీషా పట్టణ ప్రజాసంఘాల ప్రతినిధులతో, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అందరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులు బాగా పెరుగుతున్నందున ఇక ముందు కరోనాను కట్టడి చేసే బాధ్యత ప్రజలమీదే ఎక్కువగా ఉంటుందని, వారంతా కచ్చితంగా కరోనా నియమాలు పాటించాల్సి ఉంటుందని కమిషనర్ తేల్చి చెప్పారు.

కరోనా భయం వల్ల తిరుపతికి యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. నిన్న(ఏప్రిల్ 25,2021) తిరుమల సందర్శించిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదివారం తిరుమలను 16వేల 560 మంది సందర్శించారు. తలనీలాలు సమర్పించిన వారు 8,191 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.21 కోట్లు. శనివారం(ఏప్రిల్ 24,2021) 23వేల 998 మంది తిరుమలను సందర్శించారు. 13వేల 061 మంది తలనీలా సమర్పించారు.

ట్రెండింగ్ వార్తలు