Ap Rains: ఒకవైపు మండే ఎండలు.. మరోవైపు భారీ వానలు.. ఏపీ ప్రజలకు విపత్తుల సంస్థ కీలక హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో వాతావరం భిన్నంగా మారుతోంది. ఓపక్క ఎండలు మాడుతుంటే, మరోపక్క భారీ వర్షాలు(Ap Rains) ముంచెత్తనున్నాయి.

today Heavy rain and scorching heat in Andhra Pradesh

  • ఏపీలో ఎండలు, పిడుగుల హెచ్చరిక.
  • పన్నెండు జిల్లాల్లో మోస్తరు వర్షాలు.
  • పలుచోట్ల నలభైరెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు.

Ap Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా మారనుంది. బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు(Ap Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. ముఖ్యంగా అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వానలు పడవచ్చు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

IND-A Won: ట్రై సిరీస్… లంక-ఎ జట్టుపై భారత్-ఎ విజయం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్‌

మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 41 నుండి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని చోట్ల 40 నుండి 41 డిగ్రీల వరకు వేడి వాతావరణం ఉండనుంది.

గడిచిన మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో అత్యధికంగా 42.7 డిగ్రీల వేడి నమోదైంది. అలాగే దత్తిరాజేరులో 42.4, భామినిలో 42.2, తణుకులో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటితో పాటు కుక్కునూరు, కూనవరం, పిఠాపురం, కొవ్వూరు, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత రికార్డయిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.