IND-A Won: ట్రై సిరీస్… లంక-ఎ జట్టుపై భారత్-ఎ విజయం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు అద్భుత విజయాన్ని(IND-A Won) అందుకుంది.
ruturaj gaikwad century india a win vs sri lanka a
- శ్రీలంకపై భారత్-ఎ విజయం
- రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ
- బౌలర్ల సమిష్టి కృషితో గెలుపు
IND-A Won: శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత యువ జట్టు 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది.
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పాతబస్తీలో ఇద్దరు యువకులు మృతి
ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగానే అవుట్ కావడంతో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో (101) జట్టును ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ తిలక్ వర్మ (60) హాఫ్ సెంచరీతో చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 150 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోరును అందించారు.
అనంతరం 278 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ జట్టు చివరి వరకు గట్టిగా పోరాడి 269 పరుగులకు ఆలౌట్ అయింది. లంక జట్టులో కెప్టెన్ సహన్ (72), ఓపెనర్లు నిరోషన్ (47), ఫెర్నాండో (45), సదీరా (46) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు (IND-A Won)చేర్చలేకపోయారు. భారత బౌలర్లలో అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రాజ్ నిగమ్, అర్షద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసి ఒత్తిడిలో భారత్‌కు విజయాన్ని అందించారు. సెంచరీతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
