Tollywood Directors : ఈ ముగ్గురికి ఆ ముగ్గురు ఛాన్స్ ఇస్తారా..?
ఫలానా హీరోతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. (Tollywood Directors)
Tollywood Directors
Tollywood Directors : ఎన్నాళ్లుగానో మనసులో ఉంచుకున్న విషయాల్ని బయటపెట్టేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్లు. ఫలానా హీరోతో సినిమా చేయాలని ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఇరుముడి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సమ్మర్‌కి పెద్ది సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న బుచ్చిబాబు తను రైటర్‌గా రాసిన మొట్టమొదటి కథ పూర్తిగా రవితేజని దృష్టిలో పెట్టుకుని రాసిందేనని చెప్పడం అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఆయనతో సినిమా చేయాలని అనుకున్నట్టు కూడా చెప్పారు. దీంతో పెద్ది సినిమా విడుదలై రెండు నెలలు అయినా మరో ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇవ్వని బుచ్చిబాబు రవితేజతో ప్లాన్ చేస్తాడా? రవితేజ ఛాన్స్ ఇస్తాడా చూడాలి మరి.
బుచ్చిబాబు మాత్రమే కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇలాంటి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సక్సెస్‌మీట్‌కి చీఫ్‌గెస్ట్‌గా అటెండ్ అయిన త్రివిక్రమ్ తన మనసులోని మాట బయటపెట్టారు. సూర్యతో సినిమా చేయాల్సింది కానీ ఆయనకి నచ్చే కథ చెప్పలేకపోయాను. మా ఆవిడ కూడా సూర్యతో సినిమా చేయమని డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో అయినా సూర్యతో సినిమా చేయాలి అని అన్నారు. దీంతో ఫ్యూచర్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తప్పకుండా వచ్చే చాన్సుందనే అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారైనా సూర్య త్రివిక్రమ్ చెప్పిన కథ ఓకే చేస్తాడా చూడాలి.
Also Read : 100 Cr Movies : వరుసగా వంద కోట్లు కొడుతున్న సినిమాలు.. ఇండస్ట్రీకి మంచిదే..
బుచ్చిబాబు, త్రివిక్రమ్ తరహాలో డైరెక్టర్ వెంకీ అట్లూరి సైతం తన మనసులోని మాట బయటపెట్టారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న వెంకీ అట్లూరి ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరుతో సినిమా అనేది ఎప్పట్నుంచో తన చెక్‌లిస్ట్‌లో ఉంది. మెగాస్టార్ దగ్గరకి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు పక్కా ప్లానింగ్‌తో వెళ్ళాలి. అలాగే ఆయన రేంజ్ కి, ఆయన బడ్జెట్ కి ఎదగాలి. ఆయనతో ఏదో సింపుల్ సినిమా చేయకూడదు. ఒక ప్రాపర్ థ్రిల్లర్ కథ తీసుకువెళ్లాలి ఆయన దగ్గరకు. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేస్తానని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తంగా ఈ డైరెక్టర్లంతా మనసులోని మాటలు బయటపెట్టి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నారు. మరి ఈ దర్శకులకు వాళ్ళతో సినిమాలు తీయాలని ఉన్నా ఆ హీరోలు ఛాన్స్ ఇస్తారా? వీళ్ళు చెప్పే కథలు నచ్చుతాయా? వీరి కాంబోలో సినిమాలు వస్తాయా చూడాలి.
