Top scholarships 2026 : విద్యార్థులకు ఉచిత స్కాలర్‌షిప్.. నెలకు రూ.15 వేల ఆర్థిక సాయం.. ఇలా అప్లై చేయడానికి చేసుకోండి!
ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థికంగా ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం, వివిధ ప్రముఖ సంస్థలు భారీ స్కాలర్‌షిప్(Top scholarships 2026 ) పథకాలను అందుబాటులోకి తెచ్చాయి.
- V Santhosh Kumar
- Published on- September 4, 2026 / 10:18 PM IST
Top scholarships 2026 national pg scheme kotak suraksha and deendayal sparsh yojana eligibility apply online
- పీజీ విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లు
- దివ్యాంగులకు ఏటా లక్ష సాయం
- అక్టోబరు వరకు దరఖాస్తు గడువు
Top scholarships 2026 : ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థికంగా ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం, వివిధ ప్రముఖ సంస్థలు భారీ స్కాలర్‌షిప్ పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. పీజీ, డిగ్రీ, పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పథకాలను రూపొందించారు. యూజీసీ అమలు చేస్తున్న ‘నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్’ (NSPG) ద్వారా అర్హులైన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.15,000 చొప్పున ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. అక్టోబరు 31, 2026 లోపు విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగ డిగ్రీ విద్యార్థుల కోసం కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(Top scholarships 2026 ) ‘కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్’ను ప్రకటిస్తోంది. కనీసం 40 శాతం వైకల్యం ఉండి, ఇంటర్‌లో 50 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.1 లక్ష చొప్పున స్కాలర్‌షిప్‌తో పాటు మెంటార్‌షిప్ అందుతుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉన్న అభ్యర్థులు అక్టోబరు 10, 2026 నాటికి దరఖాస్తు సమర్పించాలి. వీటితో పాటు 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం తపాలా శాఖ ‘దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన’ ద్వారా ఏటా రూ.6,000 అందిస్తోంది.
దరఖాస్తు విధానం, గడువు తేదీలు: త్వరపడండి!
వివిధ పథకాలకు వేర్వేరు అర్హతలు, గడువులు నిర్ణయించారు. స్పర్శ్ యోజనకు సెప్టెంబరు 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే సెప్టెంబరు 30న రాత పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తమకు వర్తించే పథకాలను గుర్తించి, ఆధార్, మార్కుల జాబితా, ఆదాయ ధ్రువీకరణ పత్రాల వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే వివరాలు నమోదు చేసి నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
