Achanta YCP Politics : ఆచంట వైసీపీకి కొత్త ఇంచార్జ్ రాబోతున్నారా.? మాజీ మంత్రి మౌనం వెనుక మర్మమేంటి?
Achanta YCP Politics : గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆచంటకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వైసీపీ ఇక్కడ జెండా ఎగరేసినా, రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో సీన్ చేంజ్ అయింది. ప్రస్తుతం ఆచంట వైసీపీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
Achanta constituency YCP politics
Achanta YCP Politics : గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆచంటకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వైసీపీ ఇక్కడ జెండా ఎగరేసినా, రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో సీన్ చేంజ్ అయింది. ప్రస్తుతం ఆచంట వైసీపీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు.. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా, సైలెంట్‌గా ఉంటున్నారనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గ ఇంచార్జ్‌గా రంగనాథరాజు సైలెంట్ అయిపోవడంతో క్యాడర్ డైలమాలో పడిపోయిందట. అసలు అధిష్టానం ఆచంట ఇంచార్జ్‌ను మార్చాలని భావిస్తోందా? అందుకే ఈ గ్యాపా.? అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుకు..చెరుకువాడ రంగనాథరాజుకు మధ్య విభేదాలు ముదిరాయనే గాసిప్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు రాజుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కు ఎండ్‌కార్డ్ పడేదెలా.? ఒకవేళ రంగనాథరాజును కాదని పార్టీ పగ్గాలు వేరే ఎవరికైనా అప్పగించే ఛాన్స్ ఉందా.? ఇదే ఇప్పుడు ఆచంటలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Botsa Satyanarayana : బొత్స బిగ్ ప్లాన్.. రంగంలోకి కుమార్తె.. పార్టీ మార్పుపై ఆగని ప్రచారం..
ఆచంట వైసీపీ ఇంచార్జ్‌ను మార్చాల్సి వస్తే..రంగనాథరాజు కాకుండా ఆల్టర్నేటివ్ లీడర్ ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారట పార్టీ పెద్దలు. అయితే సీనియర్ అయిన రంగనాథరాజును పక్కన పెడితే ఆయన పరిస్థితి ఏంటి.? ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది.? అనేది బిగ్ క్వశ్చన్‌గా మారింది. అయితే వైసీపీ అధిష్టానం రంగనాథరాజు ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో లేదట. తండ్రి స్థానంలో ఆయన కొడుకు నరేష్ రాజుకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చిందట.
చెరుకువాడ రంగనాథరాజు కొడుకు నరేష్ రాజు బలాబలాలపై వైసీపీ అధిష్టానం సర్వే రిపోర్టులు తెప్పించుకుందట. తండ్రికి తగ్గ తనయుడిగా క్యాడర్‌ను కలుపుకుపోయే తత్వం నరేష్ రాజుకు ఉందా.? యువతలో ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి.? స్థానిక నేతలు ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తారా.? అనే కోణంలో అధిష్టానం ఆరా తీస్తోందట. ఇప్పటికే శ్రీరంగనాథరాజుకు అధిష్టానం నుంచి కొన్ని క్లియర్ కట్ హింట్స్ అందాయని, అందుకే ఆయన సైలెంట్‌గా ఉంటూ అధిష్టానం నుంచి వచ్చే అధికారిక పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారని టాక్. తాడేపల్లి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే..కొడుకును రంగంలోకి దించేందుకు రంగనాథరాజు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
స్థానిక సమరానికి ముందే ఆచంట వైసీపీలో సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. తండ్రి స్థానంలో కొడుకు వారసత్వ పగ్గాలు అందుకుంటారా.? లేక జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మార్క్ పాలిటిక్స్‌తో ఇక్కడ కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి శ్రీరంగనాథరాజును వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆచంట పగ్గాలు శ్రీరంగనాథరాజు తనయుడు నరేష్ రాజుకు అప్పగించి..మాజీ మంత్రి సేవలను కూడా ఉపయోగించుకునే ఆలోచనలో అధిష్టానం ఉందట. మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజు మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చూస్తుంటే ఈ సైలెన్స్ వెనుక ఏదో ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఆచంట వైసీపీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయో చూడాలి మరి.
