Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు.. పది రోజులు.. పది అలంకారాలు
Kanaka Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గాదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.
Kanaka Durga Temple
Kanaka Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గాదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పదిరోజులపాటు ఈ ఆధ్యాత్మిక వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
Also Read : Telangana AP Weather Today : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు పది రోజుల పాటు పది విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజుకో రూపంలో జగన్మాతను దర్శించుకునే అవకాశం భక్తులకు లభించనుంది.
అక్టోబరు 11 – తొలిరోజు : శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
అక్టోబరు 12 – రెండో రోజు : శ్రీ గాయత్రీ దేవి
అక్టోబరు 13 – మూడో రోజు : శ్రీ అన్నపూర్ణా దేవి
అక్టోబరు 14 – నాలుగో రోజు : శ్రీ మహాచండీ దేవి
అక్టోబరు 15 – ఐదో రోజు : శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి
అక్టోబరు 16 – ఆరో రోజు (మూలానక్షత్రం) : శ్రీ సరస్వతీ దేవి
అక్టోబరు 17 – ఏడో రోజు : శ్రీ మహాలక్ష్మి దేవి
అక్టోబరు 18 – ఎనిమిదోవ రోజు : శ్రీ దుర్గాదేవి
అక్టోబరు 19 – తొమ్మిదో రోజు : శ్రీ మహిషాసురమర్ధిని దేవి
అక్టోబరు 20 – చివరిరోజు : శ్రీ రాజరాజేశ్వరి దేవి
దసరా ఉత్సవాల ముగింపు రోజున తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అక్టోబరు 20వ తేదీ సాయంత్రం కృష్ణమ్మ ఒడిలో అమ్మవారికి హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పాలకమండలి ప్రకటించింది. కృష్ణా నదిలో విహరించే హంస వాహనంపై దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
