విషాదం : 3ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన మాంజా

  • Publish Date - January 6, 2020 / 11:19 AM IST

గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. పతంగికి కట్టే మాంజా మూడేళ్ల బాలుడి ప్రాణం తీసింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం లాంచెస్టర్‌లో బాబాయ్‌‌తో కలిసి బాలుడు బైక్‌పై వెళుతున్నాడు. బాలుడి చేతిలో మాంజా ఉంది. అకస్మాత్తుగా మాంజా మెడకు చుట్టుకుంది. దీంతో బాలుడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అంతేగాక.. మెడభాగం పూర్తిగా తెగిపోయింది. గమనించిన బాబాయ్..జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. సంక్రాంతి పండుగ మరికొద్ది రోజులు ఉందనగా..బాలుడు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

సంక్రాంతి పండుగ వచ్చిదంటే..చాలు..ముందుగా గుర్తుకొచ్చేది పతంగిలు. చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. దీనికి కట్టే మాంజాతో ఇతరుల పతంగులు కట్ చేస్తూ సంబరపడిపోతుంటారు. కానీ ఈ పండుగ సమయంలో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. పతంగులు ఎగురేస్తూ..ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కిందపడి చనిపోతుంటారు. దీనికి ఉపయోగించే మాంజాతో కూడా ప్రమాదం ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులను ఓ కంటకని పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. 

Read More : మోగింది నగారా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్