Temples
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులను బదిలీ చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కసాపురం, కాణిపాకం, ఇంద్రకీలాద్రి దేవస్థానాల్లో అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది శాశ్వత ఉద్యోగులను ఒక దేవస్థానం నుంచి మరొక దేవస్థానానికి బదిలీ చేశారు. శ్రీశైల దేవస్థానం ఏఈఓ కృష్ణారెడ్డి.. కాణిపాక దేవస్థానానికి బదిలీ అయ్యారు. కాణిపాక దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబును శ్రీశైలం దేవస్థానానికి బదిలీ చేశారు.
పర్యవేక్షకులు రాధాకృష్ణ.. శ్రీశైలం నుంచి కాణిపాకం దేవస్థానానికి బదిలీ
అయ్యారు. కోదండపాణిని కాణిపాకం నుంచి శ్రీశైలం దేవస్థానానికి బదిలీ చేశారు. బి. మల్లికార్జునరెడ్డి శ్రీశైలం నుంచి కసాపురం ఆలయానికి బదిలీ అయ్యారు. కె.వెంకటేశ్వరరావు శ్రీశైలం నుండి శ్రీకాళహస్తికి బదిలీ చేశారు. లోకేష్ బాబు శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలం ఆలయానికి బదిలీ అయ్యారు.
మరోవైపు శ్రీశైల భ్రమరాంబ ఆలయ కుంభకోణంలో భాగస్వాములైన ఉద్యోగులపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ గురువారం (జూన్ 11, 2020) ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు ఆంధ్రాబబ్యాంకు, ఇతర ఏజెన్సీల ఉద్యోగులు మొత్తం 33 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
వీరి వద్ద నుంచి సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.రూ. 2.56 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. దేవాదాయశాఖ విచారణ అనంతరం వీరిపై చర్యలు తీసుకోనుంది.