TTD : టీటీడీ కీలక నిర్ణయం.. ఐదు రోజులు సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు
సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.
- bheemraj
- Published On : September 30, 2023 / 06:54 PM IST
TTD Key Decision
TTD Key Decision : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో ఐదు రోజులు సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసింది. సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అధిక రద్దీ కారణంగా అక్టోబర్ 1,7,8,14,15వ తేదీల్లో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది.
భక్తులు టోకెన్లు తీసుకునే విషయంలో ఈ తేదీలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. సాధారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు 25 గంటలకుపైగా సమయమ పడుతుంది.
Tirumala Brahmothsavalu : తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
మరోవైపు టీటీడీ తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలించింది. నిన్నటి(శుక్రవారం) నుంచి
ద్విచక్ర వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో అనుతించింది . గతంలో మాదిరిగా యథావిధిగా ద్విచక్ర వాహనాలను రాత్రి 10 గంటల వరకు తిరుమల కొండపైకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. వన్య మృగాల సంచారం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
కాగా, గతంలో చిరుత పులులు అర్ధరాత్రి సమయంలో కాలి నడకన కొండపైకి వెళ్లున్న భక్తులపై దాడి చేశాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలపై వస్తున్న భక్తులపై సైతం దాడికి యత్నించాయి.
దీంతో సాయంత్రం సమయంలో తిరుమల ఘాట్ రోడ్డులోద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని టీటీడీ వెల్లడించింది.
ఇక భక్తులపై దాడి చేసేందుకు వస్తున్న వన్య మృగాలను పట్టుకునేందుకు టీటీడీ ఆపరేషన్ చిరుతను ప్రారంభించింది. ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించారు. దీంతో కొండ పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం తగ్గిందని భావించిన టీటీడీ అధికారులు యథావిధిగా ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
