TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవల రద్దు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవాలని తపించే కోట్లాదిమంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు కీలక సూచనలు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- August 4, 2026 / 07:06 PM IST
Ttd cancels special darshans and arjitha sevas for salakatla brahmotsavam
- ప్రత్యేక దర్శనాల రద్దు నిర్ణయం
- సామాన్య భక్తులకే ప్రాధాన్యతా దర్శనం
- శ్రీవారి వస్త్రాల ఈ-వేలం ప్రకటన
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవాలని తపించే కోట్లాదిమంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు కీలక సూచనలు జారీ చేసింది. తిరుమల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, వారికి త్వరగా, సౌకర్యవంతంగా స్వామివారి సర్వదర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
Ap Collages Bundh: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. రేపు కళాశాలలు బంద్..
ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవల రద్దు:
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ఇచ్చే ప్రత్యేక ప్రాధాన్యతా దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి ఆలస్యం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భక్తులంతా టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
