×
Ad

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల.. రూ. 861 కోట్ల విరాళాలు

వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు.

  • Published On : June 23, 2023 / 10:34 AM IST

Srivani Trust

Srivani Trust Donations : తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల అయింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు ఇప్పటివరకు రూ. 861 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. బ్యాంకుల్లో రూ. 603 కోట్లు డిపాజిట్ చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.

Srivari Temple : తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయం.. భూమి పూజ చేసిన అర్చకులు

ఇచ్చిన విరాళాలకు రసీదులు ఇస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.దళారీ వ్యవస్థను అరికట్టేందుకే శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేశామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 70 మంది దళారులను అరెస్టు చేసి, 214 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.