×
Ad

Tirumala: ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్‌ విజ్ఞప్తి

భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు హెచ్చరించారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని కోరారు. గ్లోబల్‌ హిందు హెరిటేజ్‌ ఫౌండేషన్‌, సేవా టెంపుల్స్‌ ఆర్గనైజేషన్‌ పేర్లతో కొందరు అక్రమంగా విరాళాలు సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని సంస్థలు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. భక్తులు అక్రమార్కుల బారిన పడొద్దని కోరారు.

సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం, టీటీడీ.. తిరుమల, పరిసర ఆధ్యాత్మిక నగరాల పవిత్రతను కాపాడుతుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు హెచ్చరించారు.

Also Read: విజయసాయిరెడ్డి రూట్‌ మార్చారా? సీఎం చంద్రబాబుకి ఆ సలహా ఇవ్వడానికి కారణం అదేనా..