Free Tirumala Laddu : తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఉచితంగా లడ్డూ, వడ ప్రసాదం.. ఎప్పటినుంచంటే?

TTD Free Laddu : తిరుమల టీటీడీ విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 7 నుంచి 20 వరకు ఉచితంగా శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాల పంపిణీ. తేదీలు, పీపీఓ నంబర్లు, పూర్తి వివరాలివే..

Free Tirumala Laddu

  • తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త
  • నవంబర్ 7 నుంచి ఉచితంగా లడ్డూ, వడ ప్రసాదం
  • తిరుపతిలో ఉచిత లడ్డూ పంపిణీ.. ఎవరికి ఇస్తారంటే?

Free Tirumala Laddu : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. స్వామివారి వైభవాన్ని కళ్లారా చూసిన భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. ఈ వేడుకల తర్వాత టీటీడీ మరో తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు ఉచితంగా శ్రీవారి ప్రసాదాన్ని అందించేందుకు రెడీ అయింది..

ప్రతి ఏడాది కొనసాగిస్తున్న సంప్రదాయంలో భాగంగా నవంబర్ 7 నుంచి 20వ తేదీ వరకు లడ్డూ, వడ ప్రసాదాలను పంపిణీ చేయనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద లడ్డూతో పాటు వడను ఉచితంగా అందించనున్నారు.

ఎక్కడ తీసుకోవాలంటే? :
తిరుపతిలోని కేటీ రోడ్డులో ఉన్న టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలో ఉద్యోగుల క్యాంటీన్ సమీపంలోని కొత్త జాబాలి భవనం వద్ద ప్రసాదాల పంపిణీ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయి.

Read Also : Blinkit Ambulance Service : ఫ్రీ అంబులెన్స్ సేవలకు బ్రేక్.. ఇప్పుడు రూ.2,500 ఛార్జీ! బ్లింకిట్ కొత్త రూల్ వెనుక అసలు రీజన్ ఇదే!

పెన్షనర్లకు స్పెషల్ షెడ్యూల్.. :
రద్దీని తగ్గించేందుకు టీటీడీ పీపీఓ నంబర్ల ఆధారంగా తేదీలను కేటాయించింది.

  • నవంబర్ 7 : PPO 164 నుంచి 3,250 వరకు.
  • నవంబర్ 9 నుంచి 13 : PPO 3,251 నుంచి 9,050 వరకు.
  • నవంబర్ 16 నుంచి 19 : PPO 9,051 నుంచి 12,550 వరకు.
  • నవంబర్ 20 : PPO 12,551 నుంచి మిగిలిన నంబర్ల వరకు.

స్మార్ట్ కార్డు మర్చిపోవద్దు :
ప్రసాదం తీసుకోవడానికి వెళ్లే విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు తమ ఒరిజినల్ స్మార్ట్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటర్ వద్ద కార్డు చూపించిన తర్వాతే ప్రసాదం అందజేస్తారు.

వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారికి ఇబ్బంది కలగకుండా తాగునీరు, వేచి ఉండేందుకు షెడ్లు వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. అర్హులైన పెన్షనర్లు తమ పీపీఓ నంబర్‌కు కేటాయించిన రోజునే వెళ్లి శ్రీవారి ప్రసాదాన్ని పొందవచ్చు.