Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు చేసింది.

Tirumala

Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు చేసింది. శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేసింది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు చేసినట్లు టీటీడీ తెలిపింది.

Also Read : Rain Alert : ఏపీకి రెడ్ అలర్ట్.. రాబోయే కొద్ది గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ..

ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులోకి తీసుకొస్తోంది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్నారు.

ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచిఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించారు. ఈ సదుపాయం 2025 మే1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుందని టీటీడీ తెలిపింది.

ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేయబడతాయి. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించబడుతుంది.

ఈ నూతన విధానం జూన్ 10వ తేది నుండి అమలులోకి రానుంది. ఈ కోటాలో బుకింగ్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపబడతాయి. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.