TTD Sarvadarshanam: సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించిన టీటీడీ

సర్వదర్శనం నిమిత్తం టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు ఇస్తుండటంతో కౌంటర్ల వద్ద జనం బారులు..

Ttd

TTD Sarvadarshanam: సర్వదర్శనం నిమిత్తం టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు ఇస్తుండటంతో కౌంటర్ల వద్ద జనం బారులు తీరారు. రోజుకు 15వేల దర్శన టోకెన్ల వరకూ జారీ చేస్తున్నారు.

సర్వదర్శన టోకెన్లు అందుకోవాలనే తపనలో తెల్లవారుజాము నుంచే లైన్లలో నిల్చొని ఎదురుచూస్తున్నారు. ప్రారంభంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండగా.. ప్రస్తుతం కౌంటర్ల వద్ద సాధారణ స్థితిలో కనిపిస్తున్నారు. దర్శన టోకెన్లు సులువుగానే లభిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు.

Read Also: భక్తులకు అందుబాటులోకి టీటీడీ గో ఉత్పత్తులు