Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
- Bharath Reddy
- Published On : May 23, 2022 / 07:06 PM IST
Ttd
Tirumala Temple: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈమేరకు తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా, ఆగస్టు నెలలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలలో నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
Other Stories:KTM RC390: కేటీఎం ఆర్‌సీ 390 2022 మోడల్‌ని విడుదల చేసిన బజాజ్
మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు బుకింగ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తామని టీటీడీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. కాగా, జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించే వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుండి మొదలవుతుందని టీటీడీ తెలిపింది.
