Waterfall
Two students died in Chittoor : చిత్తూరు జిల్లా నాగలాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని సద్దిగూడు జలపాతంలో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. జలపాతం దగ్గర లోతుగా ఉండటం.. వీరికి ఈత రాకపోవడంతో సంజయ్ కుమార్, దేవ్ ఇద్దరూ మృతి చెందారు.
అయితే జలపాతానికి ఆరుగురు విద్యార్థులు రాగా .. ఇద్దరు చనిపోయారు. వీరంతా చెన్నై మాధవరంకు చెందినవారుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Ex MLA Pichhireddy : అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి మృతి
విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.