ఏపీ రాజధాని మార్పుపై స్పందించిన కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.

  • Publish Date - January 2, 2020 / 03:06 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో గురువారం (జవవరి 2, 2019) 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదన ఏపీ సీఎం ఆలోచన అన్నారు. అమరావతితోపాటు మరో రెండు రాజధానులు అంటున్నారు. 

 

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అన్నారు. రాజధాని నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తక్కువని చెప్పారు. మూడు రాజధానుల ఫార్ములా పనిచేస్తుందో లేదో ఆ రాష్ట్రం ఆలోచన  చేయాలన్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

 

మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ మధ్యే పోటీ అన్నారు. టీఆర్ఎస్ ముసుగులో ఎంఐంఎం నేతలు పోటీ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ముసుగులో ఎంఐఎం నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చాలా పట్టణాల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో సీఏఏ ఎన్నికల ఎజెండా కాదని స్పష్టం చేశారు. 

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు అంశంపై రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. అమరావతి రాజధాని మార్పును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని రాజధాని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.