V. Srinivasa Rao : పోలవరం, నిర్వాసితుల గురించి మాట్లాడని అమిత్ షా రాష్ట్రానికి ఎందుకొచ్చినట్లు : వి.శ్రీనివాసరావు

రాష్ట్రంలో వైస్సార్సీపీ అవినీతికి పాల్పడుతుంటే నిరూపించి చర్యలు తీసుకోవాలి.. కానీ, బీజేపీ అలా చేయడం లేదన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.

V. Srinivasa Rao

V. Srinivasa Rao Criticized Amit Shah : విశాఖలో అమిత్ షా పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొన్నారు. సుజల స్రవంతి, పునరావాసం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అమిత్ షా రాష్ట్రానికి ఎందుకు వచ్చినట్లు, ఎందుకు పోయినట్లని ప్రశ్నించారు. లైడార్ సర్వే చేసి ఇంకో 36 గ్రామాలను గుర్తించామని చెపుతున్నారు.. 193 గ్రామాలు ముంపుకు గురయ్యాయని తెలిపారు.

గోదావరి, శబరి వరదల వల్ల 193 గ్రామాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు, పనికి మాలిన లెక్కలు చెపుతున్నాయని పేర్కొన్నారు. 38 మీటర్ల వరదకు 193 గ్రామాలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. వరద 45 మీటర్లు వస్తే ఇంకెన్ని గ్రామాలు మునుగుతాయోనని వాపోయారు. నాసి రకంగా పునరావసం ఇల్లు నిర్మించారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి తప్ప ప్రజల కోసం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Priyanka Gandhi: మధ్యప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ పర్యటన.. నర్మదా నదికి పూజలు

ప్రభుత్వం పునరావాసంపై దృష్టి సారించాలని కోరారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ బాధ్యులపై ఆ ఖర్చు వేయాలని.. ప్రజల సొమ్ము ప్రజలకే ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సీపీఎం పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.  జులై 20 నుండి 15 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. నిర్వాసితులతో పాటు పార్టీ కేంద్ర నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొంటారని వెల్లడించారు.

రాష్ట్రంలో వైస్సార్సీపీ అవినీతికి పాల్పడుతుంటే నిరూపించి చర్యలు తీసుకోవాలి.. కానీ, బీజేపీ అలా చేయడం లేదన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.  జనసేన, వైస్సార్సీపీ, టీడీపీకి బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చి నడిపిస్తుందని ఆరోపించారు.

Group-1 Prelims Exam: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు భారీ స్థాయిలో గైర్హాజరైన అభ్యర్థులు.. కారణమేమంటే..

అమిత్ షా వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడతారా? అని అడిగారు. రూ. 10లక్షల కోట్లు కేంద్రం నుండి వస్తే ఏమీ చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పునరావాసానికి రూ.32వేల కోట్లు అవసరమైతే రూ.7వేల కోట్లు ఇచ్చారని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు