Vaddi Raghuram : లోకేష్ పిట్టల దొరకి ఎక్కువ, భట్రాజుకి తక్కువ : వడ్డీ రఘురాం

ఆక్వా చెరువుల తవ్వకాల్లో రైతులకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. అవగాహన లేని వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని హితవు పలికారు.

Vaddi Raghuram serious Lokesh

Vaddi Raghuram – Nara Lokesh : ఆక్వా రంగంపై టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. నారా లోకేష్ పిట్టల దొరకి ఎక్కువ, భట్రాజుకి తక్కువ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి ఆక్వా రంగం గురించి మాట్లాడే హక్కులేదన్నారు. ఈ మేరకు బుధవారం ఏలూరులో 10టీవీతో రఘురాం ప్రత్యేకంగా మాట్లాడారు.

అసలు ఆక్వాజోన్, నాన్ ఆక్వా జోన్ పరిధిని పెట్టింది చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు అనుకూలంగా ఉన్నవారిని ఆక్వాజోన్ లోకి, అనుకూలంగా లేని వారిని నాన్ ఆక్వా జోన్ లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిఫిష్ సర్వే అని యాప్ ని ప్రవేశపెట్టి మొత్తం ఆక్వా రంగాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు.

Chandrababu Naidu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఆక్వా రంగం మీద ఆధారపడి సుమారు 30 లక్షల మంది ఉంటే 10 లక్షల మంది ఉన్నారని నారా లోకేష్ చెపుతున్నాడని పేర్కొన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ ద్వారా ప్రభుత్వం సీడ్ మీద, ఫీడ్ మీద, ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద నియంత్రణ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రెండు సార్లు పెంచిన ఫీడ్ ధరను రోల్ బ్యాక్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు.

ఆక్వా రంగం మీద ఏమీ అవగాహన లేకుండా మాట్లాడొద్దని చెప్పారు. ఆక్వా రైతులను, ఆక్వా రంగా అసోసియేషన్ అధ్యక్షులును పిలిచి మాట్లాడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుందన్నారు. ఆక్వా చెరువుల తవ్వకాల్లో రైతులకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. అవగాహన లేని వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని హితవు పలికారు.