Vande Bharat Sleeper Trains: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వందే భారత్ స్లీపర్.. టికెట్ ధరలు, టైమింగ్ డీటెయిల్స్ ఇవే!

ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే(Vande Bharat Sleeper Trains) భారీ తీపి కబురు అందించింది.

Vande Bharat sleeper trains become available to Andhra Pradesh people.

Vande Bharat Sleeper Trains: ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే భారీ తీపి కబురు అందించింది. ప్రసిద్ధ బెంగళూరు-ముంబై మార్గంలో దేశంలోనే అత్యంత ఆధునికమైన సెమీ హైస్పీడ్ వందే భారత్ స్లీపర్(Vande Bharat Sleeper Trains) రైలును త్వరలోనే ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. దక్షిణాదిలో తొలి వందే భారత్ స్లీపర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ రైలు సర్వీసు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సైతం వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.

Harish Rao: ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా? 25 శాతం పెరిగిన నిత్యావసరాల ధరలు.. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం

ప్రయాణ సమయం ఆరు గంటలు ఆదా:

ప్రస్తుతం బెంగళూరు నుండి ముంబై మధ్య దాదాపు 1,137 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సాధారణ రైళ్లలో 22 నుండి 24 గంటల సమయం పడుతోంది. అయితే ఈ కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం 15 నుంచి 16 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఏపీలోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాప్‌లు కేటాయించారు. ఇది రాయలసీమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

అత్యాధునిక కోచ్‌లు, వసతులు:

ఈ రైలు సర్వమ్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి రాత్రి 7:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు ముంబై చేరుకుంటుంది. బిఈఎంఎల్, ఐసిఎఫ్ సంయుక్తంగా తయారుచేసిన ఈ 16 కోచ్‌ల రైలులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. టికెట్ ధరలోనే ప్రయాణికులకు అల్పాహారం, భోజన వసతి కల్పించనున్నారు.