Vangaveeti Radha : హాట్ టాపిక్‌గా కొడాలి నాని, వంగవీటి రాధ కలయిక.. ఏం జరుగుతోంది

ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Vangaveeti Radha Krishna And Kodali Nani

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని, వంగవీటి రాధ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో పిండ తర్పణం చేశారు. ఈ సమయంలో రాధతో కొడాలి నాని ఉన్నారు. ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రాధ వైసీపీలో చేరతారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కొడాలి నాని, వంగవీటి రాధ కలయికపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ స్నేహితులు. అనేకసార్లు కలిశారు. కార్యక్రమాలు, ఫంక్షన్స్ లో కలుస్తుంటారు. రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో కూడా కలుస్తుంటారు. అయితే, వీరిద్దరి తాజా కలయిక మాత్రం హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధ వైసీపీలోకి వస్తున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా?

వంగవీటి రాధ, కొడాలి నాని.. ఈ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నా.. రాధ వైసీపీలోకి వెళ్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో విజయవాడలో బలమైన వ్యక్తిని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీలో ముఖ్య నాయకుడు, రాధకు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని ద్వారా వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.

మేము ఫ్రెండ్స్ మాత్రమే, స్నేహంలో భాగంగానే కాశీ వెళ్లాను అని కొడాలి నాని చెబుతున్నప్పటికీ దీని వెనుక రాజకీయపరమైన వ్యూహం ఉందనేది స్పష్టంగా అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసిన రాధ టీడీపీలో చేరారు. కానీ, టీడీపీలో యాక్టివ్ గా ఉండటం లేదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో వంగవీటి రాధ జనసేనలోకి వెళ్తున్నారు అనే ప్రచారం నడిచింది. తాజాగా రాధ వైసీపీలోకి వెళ్లే ఆలోచన జరుగుతోందని, అందుకు సంబంధించి వైసీపీ ప్రయత్నం చేస్తోంది అనే ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొడాలి నాని, వంగవీటి రాధ కాశీకి కలిసి వెళ్లడం ఈ వాదనలకు బలమిస్తోంది.

Also Read : వైసీపీలో టిక్కెట్ల టెన్షన్.. అభ్యర్థుల మార్పుపై మంత్రుల కీలక వ్యాఖ్యలు