టీడీపీ నేత, కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణకు ఇవాళ తెల్లవారుజామున స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వంగవీటి రాధాకృష్ణ ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్లో వంగవీటి రాధా ఉన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 48 గంటల వైద్య పర్యవేక్షణలో రాధాకృష్ణ ఉండనున్నారు.
వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి అభిమానులు తరలివెళ్తున్నారు.
అణ్వాయుధాలతో దాడి అంటూ.. హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్