పెట్రోల్ లో నీళ్లు : మొరాయిస్తున్న వాహనాలు, ఇథనాల్ సరిగ్గా కలవకపోవడమే కారణం!

vehicles are not mixing properly with ethanol : ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత..వాహనదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ లో రంగు తేడాగా ఉండడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ లో నీరు కలిసిందంటూ..వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ లో ఇథనాల కలిపే ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో..ఈ పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు కొందరు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా..ఇథనాల కలిపిన పెట్రోల్ అమ్మకాలకు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో 5 శాతం వరకు ఉండగా..ప్రస్తుతం 10 శాతం వరకు కలుపుతున్నారు. ఇథనాల్ నే ఇథైల్ అల్కహాల్ అని పిలుస్తుంటారు. దీనికి నీరు తగిలితే..నీరుగా మారిపోతుంది. పెట్రోల్ లో ఇథనాల్ కలిపే ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో నీటి చెమ్మ తగిలినప్పుడు నీరుగా మారిపోతుంది.

పెట్రోల్ బంకుల్లో ఉన్న భూగర్భ ట్యాంకుల అడుగున కొద్దిగా నీరు ఉంటుందనే సంగతి తెలిసిందే. బ్లెండింగ్ జరగకపోవడంతో..అప్పటికే ఉన్న నీటి పరిణామం ఇంకాస్త పెరిగిపోయింది. ట్యాంకుల్లో పైన ఉండే..పెట్రోల్ పరిమాణం తగ్గే కొద్ది..అడుగున ఉన్న నీరు పంపుల ద్వార బయటకొస్తుంది. ఈ పెట్రోల్ పోయించుకున్న వినియోగదారుల వాహనాలు మొరాయిస్తుంటాయి. పెట్రోల్ లో ఇథనాల్ ను కలిపే..బ్లెండింగ్ సరిగ్గా జరగడం లేదని డీలర్లు వెల్లడిస్తున్నారు. ట్యాంకర్ లోకి పెట్రోల్ నింపిన తర్వాత…ఇథనాల్ పోసి పంపిస్తున్నారు. దీంతో రెండూ సరిగ్గా కలవడం లేదనే వాదన వినిపిస్తోంది. అయితే..దీనిపై పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ఎన్నాళ్లో నుంచో జరుగుతోందని ఇంధన సంస్థలు వెల్లడిస్తున్నాయి. వాటర్ డ్రాప్స్ పెట్రోల్ ట్యాంకుల్లో పడకుండా..వాహనదారులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. బ్లెండింగ్ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో వాహదారులు ఇబ్బందులు పడుతున్నారని, నీరు కలిపిన పెట్రోల్ పోస్తూ..తప్పు చేస్తున్నారని డీలర్లను నిందిస్తున్నారని డీలర్ల సంఘం వెల్లడిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు