Chandrababu Remand
Chandrababu Remand – ACB Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు మరికొన్ని రోజుల్లో జైల్లోనే ఉండనున్నారు. చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జడ్జి. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో (అక్టోబర్ 5) ముగిసింది. రిమాండ్ పొడిగించాలని కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబును వర్చువల్ గా విచారించిన జడ్జి.. 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి విచారణ వాయిదా..
అటు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు(అక్టోబర్ 6) మరోసారి వాదనలు వింటామని విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ దూబే, సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వారి దగ్గరున్న సాక్ష్యాలను కోర్టుకి సమర్పించారు. ఈ కేసులో ఉన్న అభియోగాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రేపు మరోసారి వాదనలు వింటామన్నారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?
దాదాపు నెల రోజులుగా జైల్లోనే చంద్రబాబు..
స్కిల్ స్కామ్ కేసులో మరోసారి చంద్రబాబు రిమాండ్ ను పొడిగించడం టీడీపీ శ్రేణులకు షాక్ కి గురి చేసింది. సెప్టెంబర్ 10న రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లిన చంద్రబాబు.. రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని కార్యకర్తలు భావించారు. సెప్టెంబర్ 24న రిమాండ్ ముగిసినా కోర్టు ఆయన రిమాండ్ ను ఇవాళ్టి వరకు పొడిగించింది. సుమారు నెల రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండగా ఇకనైనా బయటికి వస్తారనుకుంటే 3వసారి రిమాండ్ పొడిగించారు. దీంతో ఈ నెల 19వ తేదీ వరకు చంద్రబాబు రాజమండ్రి జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.
Also Read: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!
ప్రమోద్ కుమార్ దూబే, చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది..
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించాను. బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన తన వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీపైనా నా వాదనలు వినిపించాను. ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. రేపు(అక్టోబర్ 6) మరోసారి 12 గంటలకు వాదనలు వింటానని న్యాయమూర్తి అన్నారు.