AB Venkateswara Rao : అయ్యో ఇలా జరిగిందేంటి..! ఏబీ వెంకటేశ్వరరావు అంచనాలు తలకిందులు.. గట్టి షాకిచ్చిన ఓటర్లు..
AB Venkateswara Rao : విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏవీ వెంకటేశ్వరరావుకు ఓట్లు బిగ్ షాకిచ్చారు.
- Harish Thanniru
- Updated on- November 4, 2026 / 07:31 AM IST
AB Venkateswara Rao
AB Venkateswara Rao : ఏపీలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి జైత్రయాత్ర కొనసాగింది. 13 కార్పొరేషన్లలో 12 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాలవేళ అందరిచూపు విజయవాడ కార్పొరేషన్ పైనే నిలిచింది. ఎందుకంటే.. ఇక్కడ కూటమి అభ్యర్థిగా జనసేన నేత వంగవీటి రాధా పోటీ చేయడంతోపాటు.. మరోవైపు.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడమే కారణం.
Also Read : Vangaveeti Radha : విజయవాడ మేయర్గా వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే? వైసీపీకి ఘోర పరాభవం
ఏవీ వెంకటేశ్వరరావుకు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో కూటమి అభ్యర్థికి ఆయన గట్టిపోటీ ఇస్తారని అందరూ భావించారు. దీనికితోడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. విజయవాడ కార్పొరేషన్లోని ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఆయన వైపు మొగ్గుచూపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనావేశారు.
అంతేకాక.. టీడీపీ నుంచి ఏబీవీకి అభిమానుల సంఖ్య కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ఆ పార్టీకి చెందిన ఓటర్లు ఆయనకు మద్దతుగా నిలుస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఏవీ వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. తనకు పెద్ద సంఖ్యలో ఓట్లు పడతాయని, రెండో స్థానంలోనైనా ఉంటానని ఏబీవీ సైతం భావించినట్లు తెలుస్తుంది. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి. గౌరవప్రదమైన ఓట్లు కూడా ఆయన సంపాదించలేకపోయారు.
కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకి మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. 1,30,872 మెజార్టీ లభించింది. వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీకి 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి. కమ్యూనిస్టులు తోడైనప్పటికీ డిపాజిట్ కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం నేత బాబూరావుకు 29,333 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఏబీవీకి వామపక్షాల ఓట్లు కూడా బదిలీ కాలేదని స్పష్టమవుతోంది. తాజా ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అనుకున్నదొకటి.. అయిందొకటి అంటూ పేర్కొంటున్నారు.
