3 రోజులుగా వరదలోనే కొత్త కార్లు, కోట్ల రూపాయల నష్టం.. విజయవాడలో నీట మునిగిన కార్ల గోడౌన్లు

నగర శివారులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు.

Vijayawada Floods : కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కార్ల గోడౌన్ ను వరద ముంచేసింది. మూడు రోజులుగా వరదలోనే కొత్త కార్లు నానిపోతున్నాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షో రూమ్ లన్నీ నీట మునిగాయి.

విజయవాడలో వచ్చిన వరదలతో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ప్రతి కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో మోటర్ పైపులు, వ్యక్తిగత వాహనాలు వరదలో మునిగాయి. ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో ఆ కార్లు రేపు లేదా ఎల్లుండి బయటపడే అవకాశం ఉంది. విజయవాడ శివారులో ప్రాంతంలోనే బుడమేరు వాగు ఎక్కువగా పొంగింది. దీంతో శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని కంపెనీలకు సంబంధించిన కార్ల షోరూమ్ లన్నీ నీట మునిగాయి. సిటీలో చిన్న షోరూమ్ లు ఉంటాయి. నగర శివారులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు. అయితే, ఇప్పుడా కొత్త కార్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.

అనూహ్యంగా వచ్చిన వరద గోడౌన్లను ముంచెత్తింది. గత మూడు రోజులుగా కొత్త కార్లన్నీ వరద నీటిలోనే నానుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీలకు సంబంధించిన గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూమ్ లలో కూడా వరద నీరు చేరింది. సింగ్ నగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి.

 

Also Read : 10 నిమిషాల వర్షానికే నదుల్లా కాలనీలు.. బెజవాడ మునిగింది అందుకేనా? ఇక్కడా బుల్డోజర్ దిగాల్సిందేనా?

ట్రెండింగ్ వార్తలు